‘Sampath Raj : పంజా’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసి, మిర్చి చిత్రం తో బాగా ఫేమస్ అయిన విలన్ సంపత్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియా లో మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులలో ఆయన ఒకడు. ఆయన లేని సినిమా లేదంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. జగపతి బాబు తర్వాత ఆ రేంజ్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టు ఈయనే.
కేవలం విలన్ పాత్రలు మాత్రమే కాకుండా, పాజిటివ్ రోల్స్ లో కూడా సంపత్ రాజ్ మెప్పించాడు. ఈమధ్య అయితే ఆయన పలు కామెడీ రోల్స్ కూడా చేస్తున్నాడు. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గా ఆయన నితిన్ తో కలిసి నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రంలో ఈయన పాత్ర ఎంత మంచిగా పండిందో మన అందరికీ తెలిసిందే. సినిమా సక్సెస్ కాలేకపోయింది కానీ, సంపత్ రాజ్ పాత్రకి మాత్రం మంచి పేరొచ్చింది.
ఇలా సంపత్ రాజ్ రీల్ లైఫ్ గురించి మన అందరికీ తెలిసిందే. కానీ రియల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ శరణ్య ని అప్పట్లో ప్రేమించి పెళ్లాడాడు. శరణ్య అంటే ఎవరో కాదు, కొమరం పులి చిత్రం లో పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించిన ఆమెనే శరణ్య అంటే. ఆమెకి 19 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు సంపత్ రాజ్ ని పెళ్లాడింది.
సంపత్ రాజ్ కి అప్పటికీ 23 ఏళ్ళు ఉంటుంది. వీళ్లిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. అయితే రీసెంట్ గా సంపత్ రాజ్ శరణ్య తో తన వైవాహిక జీవితం గురించి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శరణ్య గారితో మీ వైవాహిక జీవితం ని అలాగే కొనసాగించి ఉంటే ఎలా ఉండేది అని యాంకర్ అడగగా దానికి సంపత్ సమాధానం చెప్తూ ‘నేను ఆమెని చంపడమో, లేకపోతే ఆమె నన్ను చంపడమో జరిగేది’ అంటూ బదులిచ్చాడు.