Namratha : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు – నమ్రత జంట ముందు వరుసలో ఉంటుంది. వంశీ అనే సినిమాతో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, పెళ్లి వరకు వెళ్ళింది. ఇద్దరు పిల్లలకు జన్మని ఇచ్చి, ఎంతో సంతోషం గడుపుతున్న ఈ దాంపత్య జీవితం కొత్తగా పెళ్ళైన వారికి ఆదర్శం అనే చెప్పాలి. ఇకపోతే మహేష్ బాబు తో నమ్రత ‘వంశీ’ సినిమా చేసే సమయం లో ఆమె బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-918.png)
ఒక్కమాటలో చెప్పాలంటే ఈమె అప్పట్లో మహేష్ బాబు కంటే పెద్ద స్టార్. ఆయన కంటే బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా పారితోషికం తీసుకునేది. అలాంటి అద్భుతమైన కెరీర్ ని ఆమె మహేష్ బాబు తో పెళ్లి చేసుకున్న వెంటనే వదిలేసింది. కేవలం ఒక సాధారణ గృహిణిగా, ఇంటి వ్యవహారాలు, పిల్లల వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా మహేష్ బాబు వ్యాపారాలను కూడా దగ్గరుండి చూసుకుంటుంది నమ్రత.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-919.png)
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ నమ్రత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పెళ్లి కాకముందు పెద్ద స్టార్ హీరోయిన్ కదా..ఇప్పుడు మీ అభిమానులు చాలా మంది మిమ్మల్ని మళ్ళీ సినిమాల్లోకి చూడాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోసం మీరు చిన్న పాత్రలో అయిన నటించే అవకాశాలు ఉన్నాయా’ అని అడుగుతుంది. అప్పుడు నమ్రత దానికి సమాధానం చెప్తూ ‘మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదు’ అని తేల్చి చెప్పేసింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-920-1024x576.png)
కనీసం మహేష్ సినిమా లో అయిన చిన్న పాత్ర ద్వారా కనిపిస్తారా అని అడగగా, ‘మహేష్ బాబు రిక్వెస్ట్ చేసినా కూడా నేను నో అనే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత నమ్రత మహేష్ తో కలిసి ఒకే ఒక్క యాడ్ లో కనిపించింది, అది కూడా మహేష్ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే చేసిందట.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-921-1024x571.png)