Nagarjuna : గత కొంత కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ఎండింగ్ స్థాయికి వచ్చేసిన నాగార్జున నుండి ఇక హిట్స్ రావడం అసాధ్యం అని అభిమానులు సైతం బాధపడుతున్న సమయం లో రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నా సామి రంగ’ చిత్రం సక్సెస్ ఇచ్చిన జోష్ మామూలుది కాదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
‘హనుమాన్’ మేనియా వల్ల కాస్త వసూళ్లు తగ్గాయి కానీ, లేకపోతే ఈ సంక్రాంతికి విజేతగా నిలిచేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ రేంజ్ హిట్ కాకపోయినా, అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే రేంజ్ హిట్ అని మాత్రం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అక్కినేని నాగార్జున చంచల్ గూడా జైలులో ఉన్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అసలు నాగార్జున జైలులోకి వెళ్లడం ఏమిటి?, ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా, తన పని తానూ చేసుకుంటూ వెళ్లే అయన జైలుకు వెళ్లేంత తప్పు ఏమి చేసి ఉంటాడు అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఆయన వెళ్ళింది నిజంగా అరెస్ట్ అయ్యి కాదు, ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. మొదటి షెడ్యూల్ అక్కినేని నాగార్జున చంచల్ గూడా జైలు లో ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఈ షూటింగ్ మరో రెండు రోజుల పాటు చంచల్ గూడా జైలులోనే జరగనుంది. ఈ చిత్రం లో నాగార్జున తో పాటుగా తమిళ హీరో ధనుష్ కూడా మరో హీరో గా నటిస్తుండగా, రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నట్టు సమాచారం.