Tollywood Actors : ఇటీవలే మహారాష్ట్రలోని అయోధ్య లో 500 ఏళ్ళ హిందువుల కల, శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం అందించిన ఆలయ ట్రస్ట్ వారు, ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకోలేకపోతున్నారు.

రోజుకి లసుఖ మందికి పైగా భక్తులు శ్రీ రాముడి సందర్శనం చేసుకుంటున్నారని, భక్తుల రద్దీని అదుపు చెయ్యడానికి మా వద్ద ఉన్న భద్రతా బలగాలు కూడా సరిపోవడం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. భక్తుల రద్దీని ఎలా కంట్రోల్ చెయ్యాలి, క్యూలైన్స్ ఎలా ఏర్పాటు చెయ్యాలి అనేదానిపై అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారు త్వరలోనే టీటీడీ ని కలిసి సలహాలు తీసుకోబోతున్నారట.

ఇదంతా పక్కన పెడితే పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రామాలయం ట్రస్టు వారు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రముఖ హీరోలను, ఇతర నటీనటులను ఒక పది రోజుల పాటు శ్రీ రాముడి దర్శనం కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అదుపు చెయ్యలేక ఉన్నామని, ఈ సమయం లో సినీ నటులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వస్తే భక్తుల రద్దీని అదుపు చెయ్యడం మా వల్ల అయ్యే పని కాదని, దయచేసి దీనిని అర్థం చేసుకోగలరు అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరింది. మరి దీనిపై సినీ ప్రముఖుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మన టాలీవుడ్ నుండి ప్రారంభోత్సవానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే హాజరు అయ్యారు. మిగిలిన స్టార్స్ ఎవ్వరూ కూడా శ్రీరాముడి సందర్శనం ఇది వరకు చేసుకోలేదు.
