Jyothika : హీరో సూర్య తో విడాకుల గురించి మొట్టమొదటిసారి స్పందించిన జ్యోతిక.. అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Jyothika : సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సూర్య – జ్యోతిక జంట కచ్చితంగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలా కలిసి నటించడం తో ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగి ప్రేమకి దారి తీసింది. ఆ ప్రేమనే వీళ్ళిద్దరినీ మూడు మూళ్ళ బంధం తో ఒకటి చేసింది. వీళ్ళ పెళ్లి సూర్య తండ్రి శివకుమార్ కి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తండ్రిని ఒప్పించి సూర్య ఈ పెళ్లి చేసుకున్నాడు.

Jyothika
Jyothika

ఆ తర్వాత శివ కుమార్ కూడా వీళ్లిద్దరి ప్రేమని అంగీకరించి జ్యోతిక తో ప్రేమగా ఉండడం మొదలు పెట్టాడు. అయితే రీసెంట్ గా సూర్య – జ్యోతిక విడిపోయారని, కోలీవుడ్ లో ఒక రూమర్ తెగ ప్రచారం అయ్యింది. అందుకే సూర్య తో దూరం గా ముంబై కి వచ్చేసి గత కొంతకాలం నుండి పిల్లలతో ఇక్కడే ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగింది.

Suriya Jyothika

అయితే జ్యోతిక అసలు ముంబై లో ఉండడానికి గల అసలు కారణం ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. సూర్య తో పెళ్లి జరిగిన కొన్నాళ్ళకు ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కువగా తమిళం, మలయాళం లోనే సినిమాలు చేస్తూ వచ్చింది కానీ, తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే రీసెంట్ గానే ఈమె మూడు బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

- Advertisement -
Jyothika  Suriya divorce

ఒక సినిమా షూటింగ్ తర్వాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొనే రేంజ్ బిజీ ఉండడం తో ఆమె ముంబై లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం తో అక్కడే ఇల్లు తీసుకొని ఉంటుందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. దీంతో సూర్య తో విడాకులు రూమర్స్ కి చెక్ పడినట్టు అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here