Actress : క్యూట్ గా ఈ క్రింది ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తండ్రి ఇప్పుడు ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు. ఆయన తెరకెక్కించిన ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈయన తెరకెక్కిస్తున్న సినిమా కోసం కేవలం ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.

ఆయన మరెవరో కాదు సుకుమార్. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ కూతురు సుకృతి వేణి ఆమె. 2009 వ సంవత్సరం లో సుకుమార్ తబిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. తబిత కూడా చూసేందుకు హీరోయిన్ రేంజ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది.

ఈ ఫోటోలను చూసిన ప్రతీ ఒక్కరు సుకుమార్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉందని, ఏ రంగం లోకి వెళ్లిన ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ తో ఆయన ‘పుష్ప ది రూల్ ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 15 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో విడుదల వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే జరిగిందట.
