Meena: అతని వల్ల నేను బట్టలు విప్పేయాల్సి వచ్చింది అంటూ హీరోయిన్ మీనా షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Meena : బాలనటిగా కెరీర్ గా ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా పద్దతిగల పాత్రలు పోషిస్తూ టాప్ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చిన అతి తక్కువ మందిలో ఒకరు మీనా. ఈమె ఎంత అందంగా ఉంటుందో అంతే గొప్పగా నటించగలదు కూడా. తెలుగు, హిందీ , తమిళ భాషల్లో దాదాపుగా అందరిస్తారు హీరోల సరసన నటించి సౌత్ లో ఒక వెలుగు వెలిగిన మీనా, ఇప్పటికీ కూడా సినిమాల్లో బిజీ గా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈమధ్యనే ఆమె భర్త విద్యాసాగర్ చనిపోయినప్పటికీ కూడా కుటుంబం కోసం, కూతురు కోసం బాధ్యతగా పని చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటికీ ఆమెకు అడపాదడపా హీరోయిన్ రోల్స్ వస్తున్నాయి. మధ్యలో మంచి క్యారక్టర్ రోల్స్ వచ్చినా కూడా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పుకుంది మీనా.

మీనా కెరీర్ ని ఒక్కసారి పరిశీలిస్తే ఆమె గ్లామర్ రోల్స్ కంటే కూడా ఎక్కువగా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది. కానీ ఒకసారి గ్లామర్ రోల్ చేసే అవకాశం రావడం తో నటించడానికి ఎంత ఇబ్బంది పడిందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘నేను నా కెరీర్ మొత్తం మీద సాధారణ పాత్రలే చేస్తూ వచ్చాను. కానీ నా మిత్రులు, సన్నిహితులు ఎప్పుడూ అలాంటి రోల్స్ చేస్తే నీకు బోర్ కొట్టడా?, బోల్డ్ రోల్స్, బికినీ లేదా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్న పాత్రలు చెయ్యండి అని అనేవారు. ప్రముఖ నటుడు/ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నాకు ఆ సలహా ఇచ్చాడు. అయితే కొన్ని రోజులకు నిజంగా అలాంటి సన్నివేశం లో నటించాల్సి వచ్చింది. ప్రభుదేవా హీరో గా నటించిన సినిమాలో నేను ఒక్క సన్నివేశం లో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని రావాలి. స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్న తర్వాత నేను సిగ్గు తో బాత్రూం నుండి బయటకి రాలేకపోయాను. ఈ స్విమ్ డ్రెస్ వేసుకున్నంతసేపు ఎలా భరించాలి రా దేవుడా అనుకున్నాను. నిజంగా బోల్డ్ రోల్స్ చెయ్యడం చాలా కష్టం, ఆ క్షణం లో నాకు అలాంటి రోల్స్ చేసే హీరోయిన్ పాదాలకు దండం పెట్టాలని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది మీనా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here