ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా కొన్నాళ్లపాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ రాదు. ఇక ఆడవారికైతే సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవన్న సంగతి తెలిసిందే. ఇక మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే సినీ ఇండస్ట్రీ గురించైతే చెప్పనవసరం లేదు. ఇక్కడ ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొందరు ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.
అలాంటి టైంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ సునీత కూడా ఈ విషయాన్నే వివరించింది. ఒక పాట పాడాలి అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా దారుణమైన మాటలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తుంటారు. అయితే సింగర్ సునీత కూడా ఇదే మాటను రిపీట్ చేసింది. ఆమె కూడా తన కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. వారికి కావాల్సింది ఇవ్వకపోతే మాటలతో వేధిస్తారంటూ ఆవేదన చెందింది. తను కూడా ఎన్నోసార్లు అవమానించారని.. కానీ ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు.. ఈరోజు నేనున్న నా ఇమేజ్ కారణంగా నన్ను ఎవరు వేలెత్తి చూపించడం లేదన్నారు. కొన్నేళ్లు క్రితం అవకాశం కోసం వెళ్తే నోటికి వచ్చినట్లు వారు మాట్లాడారని చెప్పింది. అన్ని తట్టుకొని నిలబడ్డాను. కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్ లో ఉండగలిగా.. దేవుడి దయ వల్ల ఎవరికి లొంగాల్సిన అవసరం రాలేదు. సినీ పరిశ్రమలో ఏ బంధం శాశ్వతంగా ఉండదు. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు.
మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ స్టేజ్ లో నిలబడ్డాను. ఒంటరి మహిళగా ప్రయాణాన్ని ఏళ్లపాటు కొనసాగించా. ఇప్పుడు నాకు తోడు దొరికింది. నేను హ్యాపీగా ఉన్నా. అయితే చాలామంది జీవితాలు నాలా సుఖవంతం అవ్వవు.. సినీ పరిశ్రమ అనేది అందరూ చూసే అంత సులువైన దారి కాదంటూ సునీత తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.