Devara : ‘దేవర’ పై ‘ఆచార్య’ ఎఫెక్ట్..ప్రీ రిలీజ్ బిజినెస్ మరీ ఇంత తక్కువనా!

- Advertisement -

Devara: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది ప్రారంభమై ఇప్పటికి దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని ఏప్రిల్ 4 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఇప్పటి షూటింగ్ చేసిన కంటెంట్ కి సంబంధించి రీసెంట్ గానే ఒక గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది .

కొరటాల శివ నుండి హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో సినిమా వస్తుందని ఇన్ని రోజులు ఊహించలేదని, విజువల్స్ ఊహించని విధంగా ఉన్నాయని, కొన్ని షాట్స్ అయితే రాజమౌళి టేకింగ్ ని తలపించింది అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తారు. అంతా బాగానే ఉంది కానీ, ఈ గ్లిమ్స్ వీడియో తర్వాత మేకర్స్ భారీ ఫ్యాన్సీ ఆఫర్స్ తో బిజినెస్ డీలింగ్స్ ఉంటాయని అనుకున్నారు.

కానీ అనుకున్న రేంజ్ బిజినెస్ ఆఫర్స్ మాత్రం రావడం లేదని టాక్. సినిమాకి సంబంధించిన బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది. నెట్ ఫ్లిక్స్ కి మంచి ఫ్యాన్సీ ఆఫర్ తోనే డీల్ ముగిసింది. కానీ థియేట్రికల్ రైట్స్ మాత్రం బయ్యర్స్ భారీ రేట్స్ పెట్టడానికి భయపడుతున్నారు. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయలకు అడుగుతున్నారు మేకర్స్. కానీ బయ్యర్స్ అంత ఇచ్చుకోలేమని, 35 కోట్ల రూపాయలకు అయితే సిద్ధం అని అంటున్నారట.

- Advertisement -

ఓవర్సీస్ రైట్స్ ఇలాగే భారీ డిస్కౌంట్స్ అడుగుతున్నారు. 30 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుందని ఆశిస్తే, బయ్యర్స్ 20 కోట్ల రూపాయలకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వమని అంటున్నారు. కోస్తాంధ్ర ప్రాంతం లో కూడా కేవలం 40 కోట్ల రూపాయలకు మాత్రమే రైట్స్ అడుగుతున్నారట. ఒక్క సీడెడ్ ప్రాంతం లో ఒక్కటే 20 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 110 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకి పెడుతున్న బడ్జెట్ కి, జరుగుతున్న బిజినెస్ చాలా తక్కువ అనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here