Rathika Rose : బిగ్ బాస్ సీజన్ 7 లో టాస్కుల పరంగా పెద్ద ఏమి ఆడకపోయినా కూడా ప్రతీ ఎపిసోడ్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రతికా రోజ్ అనే చెప్పాలి. మొదటి వారం లో ఈమెకి ఉన్న మెమరీ పవర్ గురించి నాగార్జున చెప్పగానే అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ సీజన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఈమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు.
కానీ ఆమెకి కేవలం మెమరీ పవర్ తప్ప, ఒక్కటంటే ఒక్క ఫిజికల్ టాస్కు ఆడడం కూడా రాదనీ తర్వాత అర్థం అయ్యింది. మధ్యలో పల్లవి ప్రశాంత్ తో ఒక లవ్ ట్రాక్ నడిపి అతనికి వెన్నుపోటు పొడవడం, ఆ తర్వాత యావర్ తో లవ్ ట్రాక్ నడపడం, ఇలా బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ లోకి మూడు వారాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.
రీ ఎంట్రీ లో ఈమె కచ్చితంగా ఇరగదీస్తోంది అని అందరూ అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ కంటే కూడా మొదట్లో వచ్చినప్పుడే బాగా ఆడింది అని అనిపించుకుంది. అదంతా పక్కన పెడితే ఈమె స్పై బ్యాచ్ లో మాత్రమే కాదు, స్పా బ్యాచ్ లో కూడా కొంతకాలం సాగింది. అమర్ దీప్ తో కొంతకాలం స్నేహం చేసిన ఈమె ఆ తర్వాత అతనితో చిన్న గొడవలు ఏర్పడడం తో మళ్ళీ స్పై బ్యాచ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు బయటకి వచ్చిన తర్వాత ఆమె శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్లెవరినీ కలవలేదు కానీ, అమర్ దీప్ ని కలిసింది.
కలవడమే కాదు, తన ఇంస్టాగ్రామ్ లో అతనితో దిగిన ఫోటోని అప్లోడ్ చేస్తూ ‘కొన్ని స్నేహ బంధాలు చాలా అరుదైనవి.. అలాంటి స్నేహ బంధమే మా ఇద్దరి మధ్య ఉంది.. మా కొత్త ప్రయాణం నేటితో ఆరంభం’ అంటూ పెట్టిన ఒక్క పోస్ట్ తెగ వైరల్ గా మారింది. కొత్త ప్రయాణం ఆరంభం అనడం ఏమిటి?, అది కూడా పెళ్ళైన వ్యక్తితో, ఈమెకి ఇంకా తగ్గలేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.