Anushka : సంక్రాంతి పండుగ వచ్చిందంటే టాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలను, లేకపోతే ఫ్యామిలీ డ్రామా సినిమాలను విడుదల చెయ్యడానికి సిద్ధం గా ఉంటారు. కానీ సరిగ్గా 15 ఏళ్ళ క్రితం ‘అరుంధతి’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సృష్టించిన సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
పండగ సెలవుల్లో ప్రేక్షకులను భయపెట్టి ఆ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా రీసెంట్ సమయం లో ఎప్పుడూ రాలేదు. ఈ సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ , స్టార్ హీరోల రికార్డ్స్ ని కూడా కొల్లగొడుతున్న ‘హనుమాన్’ మూవీ ని చూసి, అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అరుంధతి’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రేక్షకులు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి అనుష్క మరియు సోను సూద్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ చిత్రం ప్రారంభం అయ్యే ముందు అనుష్క కేవలం ఒక మామూలు హీరోయిన్ మాత్రమే. అందుకే ఆమెకి రెమ్యూనరేషన్ కోటి రూపాయిల లోపే ఇచ్చాడట. ఇక విలన్ గా చేసిన సోనూ సూద్ కి కేవలం 18 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ కి అగ్రిమెంట్ చేసుకున్నారట.
కానీ ఆయన డేట్స్ అనుకున్న దానికంటే ఎక్కువ అవసరం అవ్వడం తో 45 లక్షల రూపాయిలు ఇచ్చారని టాక్. సినిమా విడుదలకు ముందు వీళ్ళ రెమ్యూనరేషన్స్ ఇంత తక్కువ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ సినిమా విడుదలై అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన తర్వాత కాంప్లిమెంట్ గా అయినా ఇంకా కాస్త డబ్బులు ఇచ్చి ఉండాల్సింది, మల్లెమాల వారు పిసినారులు లాగ ఉన్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.