Pawan Kalyan పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ధరించిన ఈ దుస్తుల విలువతో ఒక కారు కొనేయొచ్చు తెలుసా!

- Advertisement -

Pawan Kalyan ఏ పండగ జరిగినా మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి జరుపుకుంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్ళని చూసిన ప్రతీసారి మన ఇంట్లో వాళ్ళే గుర్తుకు వస్తారు. ఎవరికి ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి ఒక చోట కలిసి సంబరాలు చేసుకుంటారు. రీసెంట్ గా సంక్రాంతి సంబరాలు కూడా అలాగే చేసుకున్నారు. ఈ సంబరాలకు మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి బెంగళూరు లోని ఫామ్ హౌస్ కి వెళ్లారు.

అక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేసారు. వీరందరి కంటే ఎక్కువ హైలైట్ గా నిల్చింది పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్. మీసం, గెడ్డం తో చాలా స్మార్ట్ గా కనిపించి, ఈ సంబరాల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు అకిరా నందన్. అతనికి సంబంధించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రెండ్ అయ్యింది.

కుర్ర వయస్సులో పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఉండేవాడో,అలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఇకపోతే అకిరా ధరించిన ఈ దుస్తులు కూడా చాలా సింపుల్ గా, చూసేందుకు ఎంతో అందంగా ఉన్నాయి. ఇది రేణు దేశాయ్ ప్రత్యేకంగా ఆయన కోసం చేయించిందట. దీని విలువ సుమారుగా రెండు లక్షల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం.

- Advertisement -

రెండు లక్షల రూపాయిలు విలువ చేసే దుస్తులు మన లాంటి సామాన్య మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు వెయ్యలేరు. ఆ రెండు లక్షల రూపాయిలు మన దగ్గర ఉంటే తక్కువలో తక్కువకి వచ్చే నానో కారుని కొనుగోలు చేస్తాం, లేదా సెకండ్ హ్యాండ్ లో ఎదో ఒక మంచి కారుని కొని తిరుగుతాము. సెలబ్రిటీస్ ధరించే దుస్తులు ఆ రేంజ్ లో ఉంటాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here