Director Rajamouli గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీని ఈ పేరు శాసిస్తోంది. గతంలో తెలుగు ఇండస్ట్రీ అంటే అందరూ చిన్నచూపు చూసేవాళ్లు. అసలు తెలుగు ఇండస్ట్రీకి గౌరవం ఇచ్చే వాళ్ళు కాదు. తెలుగు ఇండస్ట్రీకి నటులు అంటే చాలా చీప్ గా చూసేవారు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఇప్పటి వరకు తను తీసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి ఫ్లాపు కాలేదు . సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ రూపు రేఖలను పూర్తిగా మార్చేశాడు.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అంటే కారణం మన రాజమౌళినే. . మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో చరిత్ర తిరగ రాశాడు . రాజమౌళి ఒక్కొక్క సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. స్టార్ హీరోలకి మించి పోయే రేంజ్ లో తీసుకుంటాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి .
అయితే రాజమౌళి చాలా పిసినారట. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ప్రతి రూపాయి కౌంట్ చేస్తూనే ఉంటాడట. అంతేకాదు డబ్బు చాలా ఇంపార్టెంట్ అని పోతే మళ్లీ తిరిగి రాదు అని ఆయన భావిస్తాడట . అందుకే డబ్బుని ఫ్యూచర్ కోసం దాచుకుంటాడట. రాజమౌళి ఫుడ్ బిజినెస్, ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ వాటిల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారట . సినిమాలో మాత్రం ఇన్వెస్ట్ చేయడం లేదు రాజమౌళి. రీజన్ ఏంటో తెలియదు కానీ రాజమౌళి కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.