Pooja : సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. త్వరలో మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. సాయి పల్లవికి ఓ చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు పూజకన్నన్. తమిళంలో చిత్తరాయి సెవ్వనం అనే సినిమాలో హీరోయిన్గా నటించిన ఆమె ప్రస్తుతం సోషల్ వర్కర్‌గా వ్యవహరిహిస్తోంది. ఒక్క సినిమాతోనే నటనకు బ్రేక్ ఇచ్చిన పూజ తరచూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పుడు పూజ తన పెళ్లి కబురుపై హింట్ ఇచ్చింది. రిలేషన్లో ఉన్నానంటూ తాజాగా బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అతడి పేరు వినీత అని, తన క్రైం పార్ట్నర్ అయిన వినీత్ ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడంటూ కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ అతడి గురించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా అతడితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. “ఈ క్యూట్ బటన్ నిశ్వార్థమైన ప్రేమ, ఓపికగా ఉండటం.. ఎప్పుడూ ప్రేమతో ఉండటం నేర్పించింది. ఇతను వినీత్.. నా సన్‌షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్నర్ .. ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్నర్” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో ఆమెకు ఇండస్ట్రీ వర్గాలు, సన్నిహితులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక చెల్లి పెళ్లిపీటలు ఎక్కుతుందనగానే.. సాయి పల్లవి పెళ్లి ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలోనూ ఎన్నోసార్లు సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి. సాయి పల్లవి పెళ్లి మ్యాటర్ హాట్‌టాపిక్‌గా ఉన్న తరుణంలో ఇప్పుడు ఆమె చెల్లి పెళ్లి కబురు రావడంతో అంతా సాయి పల్లవి పెళ్లెప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఫస్ట్ సనిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా ఆఫర్లు అందుకుంటూ.. ‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ‘తండేల్’లో నటిస్తుంది.