Allu Arjun మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంది. అందరూ కలిసి బెంగళూరు లోని ఫామ్ హౌస్ కి బయలుదేరారు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా, మెగా ఫ్యామిలీ కుటుంబీకులు మొత్తం ఈ సంబరాల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాకపోయినా కూడా ఆయన కొడుకు అకిరా, కూతురు ఆద్య విచ్చేసారు. రీసెంట్ గా విడుదల చేసిన ఫోటోలలో వీళ్లిద్దరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు.
మెగా ఫ్యామిలీ తో పాటుగా అల్లు ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ తో సహా అందరూ హాజరు అయ్యారు. ఇందులో అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ మరియు ఆయన సతీమణి కూడా హాజరు అయ్యారు. అల్లు బూబ్య్ సతీమణి చూసేందుకు చాలా హోమ్లీ గా ఉంది కదా, పైన పెట్టిన ఆ టైటిల్ కి సంబంధం ఏమిటి అని మీరు అనుకోవచ్చు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అల్లు అర్జున్ వదిన అంటే రియల్ లైఫ్ వదిన కాదు, రీల్ లైఫ్ వదిన. గతం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి వదిన గా పూనమ్ బాజ్వా నటించింది.
పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ఈ సినిమాలో అల్లు అర్జున్ కి వదినగా నటించింది. ఈ సినిమా తర్వాత కూడా ఆమె అనేక సినిమాల్లో నటించింది, ఇప్పటికీ నటిస్తూనే ఉంది కానీ, అనుకున్న స్థాయిలో స్టార్ స్టేటస్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే ఈమె, తన రీసెంట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా, అది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.