Kamal Hassan సౌత్ ఇండియా లో యాక్టింగ్ లో తోపు ఎవరు అని అడిగితే ప్రతీ ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్. ఏ హీరో అయినా నటనలో కమల్ హాసన్ ని ఒక కొలమానం గా తీసుకుంటారు. ఆయనని యాక్టింగ్ పరంగా ఒక గురువుగా భావిస్తారు. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోయి నటిస్తూ నేటికీ కూడా ఆయన కుర్ర హీరోలతో అటు నటన పరంగా ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా పోటీ ఇస్తున్నాడు అంటే కమల్ హాసన్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గానే ఆయన విక్రమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని ఏ రేంజ్ లో కొల్లగొట్టాడో మన అందరం చూసాము. నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ వసూళ్లను రాబట్టాడు. అలా సినిమాల పరంగా కమల్ హాసన్ ప్రస్తుతం పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘ఇండియన్ 2 ‘ చిత్రం కోసం ప్రస్తుతం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం కాంట్రవర్సిలతో నిండిపోయి ఉంటుంది అని మన అందరికీ తెలిసిందే. ఆయనకీ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఎంతో మందితో డేటింగ్ కూడా చేసాడట. అలా ఆరోజుల్లో శ్రీవిద్య అనే హీరోయిన్ తో కమల్ హాసన్ ప్రేమాయణం నడిపాడట. ఇద్దరు చాలా కాలం డేటింగ్ కూడా చేసుకున్నారు. కానీ శ్రీవిద్య ఇంట్లో వాళ్ళు వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదట. దీంతో శ్రీవిద్య మానసికంగా ఎంతో బాధపడింది.
ఇంట్లో వాళ్ళను వదులుకోలేక, కమల్ హాసన్ కి దూరం గా ఉండలేక ఆమె నరకం అనుభవించింది అట. అప్పట్లో వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్న సమయం లో శ్రీవిద్య గర్భం దాల్చిందట. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లితండ్రులు శ్రీవిద్య ని బాగా కొట్టి, అబార్షన్ చేయించారట. అబార్షన్ చేసిన డాక్టర్ కమల్ హాసన్ కి ఈ విషయం తెలియచేసాడట. మగబిడ్డ అబార్షన్ లో చనిపోయాడని తెలిసి కమల్ హాసన్ ఎంతో బాధపడ్డాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.