Hanuman Movie : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ సినిమాని సైతం తొక్కుకుంటూ వెళ్తున్న ‘హనుమాన్’ చిత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. గత ఏడాది టీజర్ దగ్గర నుండే ఈ సినిమాకి ఒక రేంజ్ హైప్ వచ్చింది. ఆ హైప్ ని అలాగే కొనసాగిస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది.

ఇకపోతే ఈ సినిమాకి మొదటి రోజు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాగా రెండవ పది కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లు రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండవ రోజు ఈ చిత్రానికి ఏకంగా 8 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు మన తెలుగులో బాహుబలి సిరీస్, #RRR మరియు సలార్ కి తప్ప ఏ సినిమాకి కూడా రాలేదు.

తెలుగు వెర్షన్ సంగతి పక్కన పెడితే, హిందీ వెర్షన్ సంగతి ఏమిటి?, ఆ ప్రాంతం లో ఇలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతారు కదా?, కానీ ఎవ్వరూ హిందీ వసూళ్ల గురించి మాట్లాడుకోవడం లేదేంటి అని మీకు కచ్చితంగా సందేహం కలిగి ఉండొచ్చు. మీకోసమే హిందీ డేటాని మాకున్న విశ్వసనీయ వర్గాల నుండి తీసుకొచ్చాం. హిందీ లో మొదటి రోజు ఈ చిత్రానికి రెండు కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. అంటే అల్లు అర్జున్ పుష్ప మొదటి రోజు వసూళ్లకంటే ఎక్కువ అన్నమాట.

ఇక రెండవ రోజు ‘హనుమాన్‘ చిత్రం మూడు కోట్ల 25 లక్షలు వసూలు చేసింది. అలా రెండు రోజులు ఆరు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మూడవ రోజు ఏకంగా 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ఇంకా అక్కడి ఆడియన్స్ కి టాక్ పూర్తిగా రీచ్ అవ్వలేదు. ఒక్కసారి రీచ్ అయితే ఈ చిత్రం అక్కడ కూడా అద్భుతాలు సృష్టిస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.