Prashanth Varma : అతి తక్కువ థియేటర్స్ లో చిన్న సినిమాగా విడుదలై నేడు పెద్ద సినిమాలకు వణుకుపుట్టేలా చేస్తున్న హనుమాన్ మూవీ టికెట్స్ కోసం జనాలు బయట ఏ రేంజ్ లో పోటీ పడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ వంటి సిటీస్ లో అయితే కనీసం వంద టిక్కెట్లు కూడా దొరికే అవకాశం లేకుండా పోయింది. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ రన్ ని దక్కించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు అంత కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందట.
ఈ రేంజ్ సక్సెస్ అందుకున్న తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మంచిగా సక్సెస్ పార్టీలు చేసుకుంటున్నాడు అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఆయన విడుదల ముందు రోజు నుండి నేటి వరకు తీవ్రమైన జ్వరం తో బాధపడుతూ ఉన్నాడట. ఈ జ్వరం తోనే ఆయన సినిమా ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసి, కనీసం నిద్ర కూడా లేకుండా పని చేసాడట.
కాసేపటి క్రితమే అదే జ్వరం తో ఆయన సక్సెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు. తనకి ఇంత వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఆయన ఆ క్షణం లో డాక్టర్ దగ్గరకి వెళ్లాలని అనుకోలేదట. పని పూర్తి అయ్యి, సినిమా విడుదలై సక్సెస్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాతే డాక్టర్ దగ్గరకి వెళ్లాలని అనుకున్నాడట. అనుకున్న విధంగానే సినిమా సక్సెస్ అయ్యింది, సక్సెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడట.
ఇదంతా చూస్తుంటే పని మీద ఆయనకీ ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా తెలుగు లో సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రం హిందీ లో కూడా తన సత్తా చాటడం మొదలెట్టింది. మొదటి రోజు ఈ సినిమాకి మూడు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇదే జోరు ని ఫుల్ రన్ లో చూపిస్తుందో లేదో చూడాలి.