Mahesh Babu : మహేశ్ సొంత థియేటర్లోనే ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్.. మరి అంత చెత్తగా ఉందా బ్రో

- Advertisement -


Mahesh Babu : 2024 సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ముందుగా మహేశ్ గుంటూరు కారం, తేజ హనుమాన్ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ గుంటూరు కారం మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయనే చెప్పుకోవాలి. సినిమా విడుదలకు ముందు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తీరా సినిమా హాల్లోకి వెళ్లగానే 15సినిమాలకే సినిమా బోర్ అన్న ఫీలింగ్ వచ్చిందంటున్నారు జనాలు. దీంతో పాటు విడుదలైన హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది.

ఇక దీంతో సూపర్ స్టార్ అభిమానులంతా డీలా పడిపోయారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. మహేష్ సొంత మల్టీప్లెక్స్ థియేటర్లో గుంటూరు కారం షో క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హనుమాన్ స్పీడ్ పెరగడంతో గుంటూరు కారం సినిమాకు ఎదురు దెబ్బ తగిలింది.

ఏకంగా మహేష్ సొంత మల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో మొదటి రోజే గుంటూరు కారం సినిమా క్యాన్సిల్ అయింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు ఎలాంటి బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్ లోనే పెద్ద దెబ్బ తగిలిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి మల్టీప్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here