Victory Venkatesh : జబర్ధస్త్ కమెడియన్ చెంప చెల్లుమనిపించిన వెంకటేష్.. ఒక్కసారిగా షాక్ అయిన మీనా, ఖుష్బు

- Advertisement -


Victory Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుస హిట్లతో విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. సంక్రాంతి బరిలో ఆయన సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు వెంకటేష్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో నిర్వహించిన అల్లుడా మజాకా షోలో ఆయన సందడి చేశాడు.

ఇక ఈ ఎపిసోడ్‌లో సీనియర్ హీరోయిన్ మీనా, ఖుష్బూ కూడా పాల్గొని వెంకటేష్ తో కలిసి మెరిశారు. ఎప్పటిలాగే కమెడియన్స్ కూడా తమదైన శైలిలో తమ కామెడీ పంచ్‌లతో ఆకట్టుకున్నారు. కాగా వెంకటేష్ స‌డ‌న్ గా లేచి ఒక కమెడియన్ పై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన హీరోయిన్ మీనా, ఖుష్బూతో పాటు అక్కడున్న అందరూ షాక్‌ అయ్యారు. వెంకటేష్ ఘర్షణ మూవీలో ఏసీబీ రామచంద్ర గెటప్ వేశాడు. లోకల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో నటించిన సునామీ సుధాకర్ చెంపను చెల్లుమనిపించాడు.

సుధాకర్ రింగ రింగ.. రింగ రింగ సాంగ్ పాడుతుంటే ఏంట్రా అది అంటూ వెంకటేష్ సీరియస్ గా అడిగాడు. పాట అని సుధాకర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా సుధాకర్ చెంప చెల్లుమనిపించాడు వెంకటేష్. పొట్టి న‌రేష్‌తో కూడా తనదైన స్టైల్ లో కామెడీ పండించాడు వెంకటేష్. అయితే ఇదంతా స్క్రిప్ట్ లో భాగమే అని క్లియర్ కట్ గా తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వెంకటేష్ హాజరుకాడు. కానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదటిసారి బుల్లితెర షోలో వెంకటేష్ సంద‌డి చేయడంతో అభిమానులు అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here