Teja Sajja : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ‘హనుమాన్’పైనే అందరి దృష్టి పడింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా అందులో ఎక్కువ బజ్ అందుకుంది మాత్రం ‘హనుమాన్’ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అంతా ‘గుంటూరు కారం’ వైపే చూశారు. ఈ మూవీ పక్కా హిట్ అనుకున్నారు. కానీ ఈ సినిమా కంటే కూడా ‘హనుమాన్’ మూవే బెటర్ రివ్యూస్ అందుకుంది. దాంతో ఇండస్ట్రీ అంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటుంది. త్రివిక్రమ్-మహేష్ వంటి దిగ్గజాల సినిమాను సైతం వెనక్కి నెట్టి హిట్ కొట్టడమంటే సాధారణ విషయం కాదు.
అదీ కూడా ఓ యంగ్ హీరోతో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. ఇదే టైంలో హనుమాన్ నటీనటుల రెమ్యూనరేషన్ కూడా ఆసక్తిగా మారింది. ఈ లెటేస్ట్ బజ్ ప్రకారం హనుమాన్ కోసం ప్రధాన తారాగణంకు ఇచ్చిన రెమ్యునరేషన్ పది కోట్లు కూడా దాటలేదట. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జా.. అద్భుతం, జాంబిరెడ్డి వంటి సినిమాలతో హీరోగా మెప్పించాడు. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమాలో లక్కీ చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాలో సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న తేజా సజ్జా హనుమాన్ కోసం దాదాపు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
హనుమాన్‌లో హీరోకు అక్కగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇందుకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. 1 కోటీ నుంచి రూ. 1.5 కోట్ల వరకు తీసుకుందని తెలుస్తోంది. అ! వంటి తొలి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సూపర్ హీరో జానర్లో హనుమాన్ రూపొందించి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. కేవలం రూ. 55 కోట్ల బడ్జెట్‌తో 11 భాషల్లో సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీకి బిగ్ హిట్ అందించాడు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ తీసుకున్న రెమ్యునరేసన్ రూ.1.5 కోట్లని సమాచారం. దీనిపై అధికారిక సూమాచారం లేదు కానీ, సోషల్ మీడియాలో ఆయన పారితోషికంపై చర్చ నడుస్తోంది.