Sreeleela : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఒక అమ్మాయి చుట్టూ ఇప్పుడు సినీ పరిశ్రమ తిరుగుతుంది అని మనోళ్లు ఇన్ని రోజులు గర్వం గా చెప్పుకున్నారు. చేతిలో డజనుకు పైగా సినిమాలను పెట్టుకొని టాలీవుడ్ లో నెంబర్ 1 స్పాట్ ని కబ్జా చేసేసింది. కానీ ఆమెకు డ్యాన్స్ తప్ప యాక్టింగ్ అసలు రాదనీ, రెండు మూడు ఫ్లాపులు పడితే మాయం అయిపోతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేసారు.

వాళ్ళు చెప్పినట్టుగానే శ్రీలీల పరిస్థితి అతి త్వరలో అలాగే అయ్యేటట్టు అనిపిస్తుంది. ‘ధమాకా’ చిత్రం తర్వాత ఆమె ‘స్కంద’, ‘ఆదికేశవ’, ‘భగవంత్ కేసరి’, ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ మరియు ‘గుంటూరు కారం’ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల్లో కేవలం ‘భగవంత్ కేసరి’ చిత్రం మినహా, మిగిలిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

నిన్న విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా ఫ్లాప్ తో ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి శ్రీలీల ని తప్పించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్స్ రావడం తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల కంటే ‘మీనాక్షి చౌదరి’ లేదా ‘మృణాల్ ఠాకూర్’ ని ఈ చిత్రం లో హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట హరీష్ శంకర్.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లో ఇప్పటి వరకు తీసిన సన్నివేశాల్లో శ్రీలీల కి సంబంధించిన ఔట్పుట్ పై హరీష్ శంకర్ సంతృప్తిగా లేడని టాక్. అందుకే ఈ చిత్రం నుండి శ్రీలీల ని తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఆ హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్‘ అవుతుందా లేదా ‘మీనాక్షి చౌదరి’ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.