Hanuman Movie Review : ‘హనుమాన్’ మూవీ ఫుల్ రివ్యూ..హనుమంతుడి విశ్వరూపాన్ని ప్రతీక గా నిల్చిన క్లైమాక్స్!

- Advertisement -

నటీనటులు : తేజా సజ్జల, అమ్రితా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.

రచన – దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : నిరంజన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

Hanuman Movie Review : చిన్న హీరోలతో సినిమా చేసిన కంటెంట్ బాగుంటే ప్రపంచం లో సినీ లవర్స్ అందరూ నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అనడానికి నిదర్శనం గా నిల్చింది ‘హనుమాన్’. గత ఏడాది చిన్న టీజర్ తోనే ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఈ చిత్రం, అదే రేంజ్ ఊపుని మైంటైన్ చేస్తూ వచ్చింది. మధ్యలో ఒకసారి వాయిదా పడినప్పటికీ, ఈ చిత్రం ఆడియన్స్ లో ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. అలా టీజర్, ట్రైలర్, హనుమాన్ చాలీసా సాంగ్ తో అంచనాలను రోజురోజుకి పెంచుకుంటూ వెళ్లిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

- Advertisement -

కథ :

అంజనాద్రి అనే గ్రామం లో హనుమంతు (తేజా సజ్జా) అనే అబ్బాయి అల్లరి చిల్లరగా తిరుగుతూ గ్రామం లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతుంటాడు. ఆ గ్రామం పై పాలెగార్ల కన్ను పడి ఉంటుంది. అక్కడి గ్రామస్తులపై దౌర్జన్యాలు చేస్తూ జనాలను అనేక విధాలుగా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆ పాలగార్లపై తిరుగుబాటు చేసినందుకు హనుమంతు ని చితకబాది పాలెగార్లు సముద్రం లో పడేస్తారు. సముద్రం లో పడిన తర్వాత హనుమంతుకి అత్యంత అతీతమైన శక్తి కలిగియున్న రుధిరమణి దక్కుతుంది. ఆ మణిని ధరించిన కారణంగా హనుమంతు అత్యంత బలవంతుడిగా, పరాక్రమశాలిగా మారిపోతాడు. తన గ్రామప్రజలు వేధిస్తున్న పాలెగార్లను చితకబాది తరిమేస్తాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న మైఖేల్ (వినయ్ రాయ్) వీడికి ఇంత పరాక్రమం ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి అంజనాద్రి కి వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది?, దుష్టశక్తులను హనుమంతు ఎలా ఎదురుకున్నాడు అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

హనుమంతుడి పవర్స్ ఒక కుర్రాడికి దక్కి, ఆ కుర్రాడు సూపర్ హీరో గా మారి దుష్ట శక్తుల నుండి తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కాస్త స్లో గా ప్రారంభం అయ్యినప్పటికీ రుధిరమణి హీరో కి దక్కినప్పటి నుండి సినిమా స్క్రీన్ ప్లే లో వేగం అందుకుంటుంది. చాలా సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేస్తాది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చిన సన్నివేశం అయితే ఆడియన్స్ చేత పూనకాలు రప్పించేలా చేస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే. అనేక సన్నివేశాలు ఆడియన్స్ కి వేరే లెవెల్ హై ని ఇస్తుంది. అసలు ఈ సినిమాకి బడ్జెట్ కేవలం 20 మాత్రమే అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ రేంజ్ విజువల్స్ ని అందించాడు డైరెక్టర్.

ఇక సెకండ్ హాఫ్ లో హీరో సోదరితో ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత మధ్యలో సినిమా స్క్రీన్ ప్లే కాస్త స్లో అయినా, చివరి 20 నిమిషాలు మాత్రం థియేటర్ లో మన ఒళ్ళు జలదరించేలా చేస్తుంది. ఇలాంటి సినిమాటిక్ హై పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన గ్రాఫిక్ కంటెంట్ ఎలా రాబట్టుకోవాలి అనేది ప్రశాంత్ వర్మ దగ్గర రాజమౌళి లాంటోళ్ళు కూడా కోచింగ్ తీసుకోవచ్చు. ఇక సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మన రోమాలను నిక్కపొడుచుకునేలా చేస్తుంది. మామూలుగా ఉన్న సన్నివేశాలను కూడా వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

చివరి మాట :

ఇలాంటి సినిమాని థియేటర్ లో మిస్ అయితే, ఓటీటీ లో చూసినప్పుడు చాలా పెద్ద పొరపాటు చేశామే అని ఫీల్ అవుతారు. అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలిగించిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ అని చెప్పేయొచ్చు.

రేటింగ్ : 3.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here