Nayanthara : కాంట్రవర్సీలతో సావాసం చేసే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఈమె మీడియా కి సాధ్యమైనంత వరకు చాలా దూరం గా ఉండేందుకే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఆమెపై ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని వివాదాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈమె, పెళ్ళికి ముందు చాలా మంది హీరోలతో లవ్ స్టోరీస్ నడిపింది, వాటి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే.
కానీ ఎట్టకేలకు ఆమె సతీష్ విగ్నేష్ అనే తమిళ దర్శకుడిని ప్రేమించి, అతనితో కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత గ్రాండ్ గా చెన్నై లో పెళ్లి చేసుకుంది. ఏ ముహూర్తం లో పెళ్లి చేసుకుందో తెలియదు కానీ, వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఎదో ఒక విషయం లో ఈ జంట వివాదాల్లోకి చిక్కుకుంటూనే ఉంది.
పెళ్ళైన మూడు నెలలకే సరోగసి కేసు లో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరిగిన ఈ జంట, ఇప్పుడు ఇద్దరు తమ రీసెంట్ సినిమాల కారణంగా మళ్ళీ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. ఇలా వైవాహిక బంధం మొదలు పెట్టినప్పటి నుండి ఎదో ఒక సమస్య ఈ దంపతులను వెంటాడుతూనే ఉంది. ఈ స్థాయి గందరగోళం ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య ఎదో ఒక విషయంలో, ఎదో ఒక సందర్భంలో గొడవలు రావడం సహజమే. అలాంటి గొడవలే ఈ దంపతులిద్దరి మధ్య రీసెంట్ టైం లో ఏర్పడింది అట.
రాత్రి సమయం లో ఇద్దరు గొడవలు వేసుకుంటూ,పెద్ద అరుచుకోవడం వంటివి చుట్టుపక్కన పరిసరాల్లో ఉన్నవాళ్లు గమనించారట. మొన్న రాత్రి నయనతార విగ్నేష్ మీద కోపం తో ఇల్లు వదిలి కార్ లో దూరంగా వెళ్లిపోయిందట. ఒకరోజు మొత్తం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నింది అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆరోజు అర్థరాత్రి బయటకి వెళ్లిన ఆమె ఈరోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చిందట. ఈమధ్య కాలం లో ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదని, ఇలాగే ఉంటే వీళ్లిద్దరు కూడా విడిపోవడం ఖాయం అని అంటున్నారు నెటిజెన్స్.