Nithin : నితిన్ కు తీవ్ర ప్రమాదం.. గాయాల కారణంగా షూటింగ్ కు బ్రేక్

- Advertisement -


Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నితిన్. కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టి కెరీర్ కు గట్టి పునాది ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడ్డా వాటి సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే ఆయన్ ఎక్సాట్రార్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం నితిన్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన కొత్త సినిమాకు పవన్ కల్యాణ్ సినిమా అయిన తమ్ముడు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్లాడు.. అక్కడ భారీ యాక్షన్ సన్నీ సీన్లను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసింది చిత్ర బృందం. నితిన్ చేతికి గాయం కావడంతో పరీక్షించిన వైద్యులు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. గతేడాది వచ్చిన ఒక్క సినిమా కూడా నితిన్ కి సరైన హిట్ ఇవ్వలేకపోయింది. నితిన్ ఇప్పుడు చేస్తున్న తమ్ముడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

శ్రీనివాస కళ్యాణం తర్వాత మరో సారి నితిన్ దిల్ రాజు బ్యానర్‌లో చేస్తున్న సినిమా ఇదే. నితిన్ పవర్ స్టార్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. ఈసారి ఆయన సినిమా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని.. అందుకే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here