Rashmika Mandhana : కొన్నిసార్లు కొంతమంది అభిమానులు సెలబ్రిటీలకు తలనొప్పి తెచ్చే పనులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎక్కడ కనిపించినా సరే.. ఫోటోలు, ఆటోగ్రాఫ్ లంటూ ఎగబడిపోతుంటారు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ అభిమానమే అయినా ఆ స్టార్ సెలబ్రెటీస్ కు కొన్ని సార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని వేళలా ఓపికగా ఫోటోలు ఇచ్చే టైం ఉండదు. కొన్నిసార్లు షూట్ టైం అయిపోతూ త్వరత్వరగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి .
అప్పుడు వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోకుండా అభిమానులు ఇబ్బంది పెడితే ఇలానే ఉంటుంది. ఇటీవల రష్మిక మందన్నా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. రష్మిక .. యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొనడానికి ముంబై వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ ఆమెతో సెల్ఫీ దిగడానికి అభిమానులు చుట్టు గుమిగూడారు. ఫ్యాన్స్ చుట్టూ ముట్టారు.. కంగారుపడిన రష్మిక త్వరగా బయలుదేరాలి అని టైం అయిపోతుంది అని హడావుడి పడింది. ఆ కన్ఫ్యూషన్ లో తన కారు బదులు వేరే కారు ఎక్కబోయారు.
వెంటనే తన టీం స్పందించి.. మేడం అది మన కారు కాదంటూ అలర్ట్ చేసింది. దీంతో వేగంగా తన కారు వైపు పరుగులు తీసింది. ఈ లోపు కూడా ఫోన్ పట్టుకొని ఫోటో ఒక్క ఫోటో మేడం అంటూ ఎగబడ్డారు జనాలు.ఇద్దరు ముగ్గురితో సెల్ఫీ దిగి నాకు టైం లేదు అంటూ కారు ఎక్కి వెళ్లిపోయింది . ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పాపం రష్మిక జనం దెబ్బకు పబ్లిక్ గా పరుగులు పెట్టింది అంటూ జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.