Cinema Industry : ఈ నెల 22 వ తారీఖున అయోధ్య నగరం లో రామ మందిరం ఘనంగా ప్రారంభం అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశం నలుమూలల నుండి రామ భక్తులు వేలాది సంఖ్యగా రామ మందిరం లో రామ్ లుల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసేందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమం కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ కి ఆహ్వానం దక్కింది.
వీళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ, మన టాలీవుడ్ నుండి రామ మందిరానికి ఎంత విరాళాలు వెళ్లాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గతం లో తాను 30 లక్షల రూపాయిలు రామ మందిరం కి విరాళం ఇవ్వడమే కాకుండా తనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలతో కూడా విరాళాలు అందించాడు. అలా మొత్తం పవన్ కళ్యాణ్ వైపు నుండి 75 లక్షల రూపాయిల విరాళం అందింది.
అలాగే చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ మరియు మహేష్ బాబు వంటి వారు కూడా విరాళాలు పంపారట కానీ, ఎంత విరాళం పంపించారు అనేది మాత్రం బయటకి రానివ్వడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మన టాలీవుడ్ నుండి మొత్తం కలిపి 5 కోట్ల రూపాయిలు విరాళం గా వెళ్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమి అవసరం వచ్చినా మేము ఉన్నాము అంటూ స్పందించే ఈ హీరోలు తప్ప మిగిలిన వాళ్ళు డొనేషన్స్ చేసినట్టు ఎక్కడ వార్త వినిపించలేదు.
ఇకపోతే కొన్ని అనుకొని కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కాలేకపోతున్నారు. ఇక ప్రభాస్ అయితే రీసెంట్ గానే మోకాళ్ళ సర్జరీ అయ్యింది కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సంగతి మన అందరికీ తెలిసిందే, మరో మూడు నెలల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆయన కసరత్తులు చేస్తూ బిజీ గా ఉన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా అయోధ్య కి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.