Devara : ‘దేవర’ చిత్రం తో ‘కేజీఎఫ్’ కి లింక్..గ్లిమ్స్ లో మీరెవ్వరు గమనించని విషయం!

- Advertisement -

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవర’ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఊర మాస్ యాక్షన్ మరియు డైలాగ్ డెలివరీ తో పాటుగా, కొరటాల మార్క్ క్లాసిక్ మేకింగ్ ఈ గ్లిమ్స్ వీడియో కి ప్రధాన హైలైట్ గా నిల్చింది. ముఖ్యంగా కొన్ని షాట్స్ అయితే ఇప్పటి వరకు ఎక్కడా చూడనివి ఈ గ్లిమ్స్ లో చూపించాడు.

ఇంత క్రియేటివ్ గా రాజమౌళి తర్వాత కొరటాల శివనే ఆలోచించాడు అని చెప్పాలి. ‘ఆచార్య’ ఫ్లాప్ అతనిలో ఎంత కసి పెంచిందో చెప్పడానికి ఈ గ్లిమ్స్ వీడియో నే ఉదాహరణ. సినిమా కూడా ఇదే రేంజ్ టేకింగ్ తో తీసి ఉంటే, కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో దేవర ప్రభంజనం సృష్టించడం పక్కా, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరడం కూడా పక్కా.

ఇదంతా పక్కన పెడితే పైన హెడ్ లైన్ ‘దేవర’ కి మరియు ‘కేజీఎఫ్’ కి లింక్ పెట్టాడు ఏమిటి?, దేవర తీసింది కొరటాల శివ, కేజీఎఫ్ తీసింది ప్రశాంత్ నీల్. ఇద్దరివీ సపరేట్ ప్రపంచాలు. అలాంటిది సంబంధం లేకుండా ఈ రెండు సినిమాలకు లింక్ ఏమిటి అని మీరు అనుకోవచ్చు. లింక్ ఉందంటే నిజంగా ఆ రెండు సినిమాలకు లింక్ ఉన్నట్టు కాదు, కేజీఎఫ్ లో ఉన్న డైలాగ్ ని కొరటాల శివ ఎన్టీఆర్ తో చెప్పించాడు అని.

- Advertisement -

గ్లిమ్స్ చివర్లో ఎన్టీఆర్ ‘ఈ సముద్రం చేపలకంటే, కత్తుల్ని,నెత్తురుని ఎక్కువగా చూసింది. అందుకేనేమో దీనిని ఎర్రసముద్రం అని పిలుస్తారు’ అని అంటాడు. సరిగ్గా ఇలాంటి డైలాగ్ కేజీఎఫ్ లో కూడా ఉంటుంది,ఆ డైలాగ్ ఏమిటంటే ‘ఈ కేజేఎఫ్ గోడల్లో ఉండే సిమెంట్, నీళ్లకంటే ఎక్కువగా రక్తాన్ని తాగింది, దానికి కారణమే ఈ కత్తి’ అని ఉంటుంది. దాదాపుగా అదే డైలాగ్ లో కొరటాల శివ కాపీ కొట్టాడని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here