Devara : ‘దేవర’ గ్లిమ్స్ వీడియో వచ్చేసింది..బుడ్డోడి ఊచకోత మామూలుగా లేదు!

- Advertisement -

Devara : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నుండి సోలో మూవీ వచ్చి ఆరేళ్ళు అయ్యింది.

Devara : '
Devara

దానికి తోడు డైరెక్టర్ కొరటాల శివ కసితో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది. మళ్ళీ ఆ కాంబినేషన్ లో సినిమా అనడంతో మార్కెట్ లో ఈ సినిమాకి ప్రారంభ దశ నుండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. ఇకపోతే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ వీడియో కాసేపటి క్రిష్టమే విడుదల చేసారు.

ముందుగా ఈ గ్లిమ్స్ వీడియో గురించి మాట్లాడాలంటే సంగీత దర్శకుడు అనిరుద్ గురించి మాట్లాడాలి. అందరూ అనిరుద్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేసి తమ సినిమాకి ఎందుకు పెట్టుకోవాలని అనుకుంటారో ఈ గ్లిమ్స్ వీడియో ని చూస్తే అర్థం అవుతుంది. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు మెంటలెక్కిపోయారు. ‘ఆల్ హైల్ ది టైగర్’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇక రాబొయ్యే రోజుల్లో సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే ఈ ట్రైలర్ లో విజువల్స్ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో అద్భుతంగా ఉన్నాయి. అసలు కొరటాల శివ నుండి ఇలాంటి ఔట్పుట్ ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కేవలం సందేశాత్మక చిత్రాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. మొట్టమొదటి సారి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ని డీల్ చేసాడు. ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఏప్రిల్ 4 వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here