Actor : ఈ ఫోటోలో మెడల్ అందుకుంటున్న స్టార్ హీరోను గుర్తు పట్టారా.. ?

- Advertisement -


Actor : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత స్టార్ సెల‌బ్రెటీల‌కి సంబంధించిన విష‌యాలు ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, తాలూకా పిక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా, మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో.

సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయని చెప్పలేం కానీ మంచి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడున్న అవకాశాలను చూసి అల్లాడిపోతున్నారు. అంతేకాదు స్టార్ హీరోకి బావమరిది.. అలాగే సీనియర్ హీరోకి అల్లుడు కూడా.. అతనెవరో మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను.. అవును మీ ఊహ కరెక్ట్. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలో హీరో మరెవరో కాదు సుధీర్ బాబు. ఘట్టమనేని వారి ఇంటి అల్లుడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ. ఆ మధ్య సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన స్టైల్లో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు. పలు ఆటల్లో కొన్ని అవార్డులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడు పతకం అందుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాడ్మింటన్‌లో జాతీయ ఆటగాడు కూడా అయిన సుధీర్ ఆ తర్వాత క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. ఫిట్ నెస్ విషయానికి వస్తే నేటితరం హీరోల్లో చాలామంది సుధీర్‎ను చూసి వావ్ అంటున్నారు. ఒకసారి బ్యాడ్మింటన్ ఆడుతూ ఏపీలో నంబర్ వన్ ర్యాంక్ కూడా సాధించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here