Nayanthara : ‘LIC’ స్కాం లో హీరోయిన్ నయనతార భర్త అరెస్ట్..? అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Nayanthara : పాపం నయనతార భర్త సతీష్ విగ్నేష్ కి పెళ్లి తర్వాత ఏది కలిసి రావడం లేదు. నిన్న మొన్నటి వరకు సరోగసి కేసు లో చిక్కుకొని నయనతార తో పాటు సతీష్ కూడా కోర్టు చుట్టూ తిరిగాడు. ఆ తర్వాత అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ చేతుల దాకా వచ్చి చెయ్యి జారిపోయింది. ఈ అవకాశం కోల్పోయినందుకు సతీష్ మానసికంగా చాలా కృంగిపోయాడు.

Nayanathara

మళ్ళీ తేరుకొని ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ తో LIC అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా, ఎస్ జె సూర్య ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాకి ఇప్పుడు మరో అడ్డంకి ఎదురైంది. ఈ విషయం లో సతీష్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

అసలు విషయానికి వస్తే ‘ఎల్ఐసి’ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ కి షార్ట్ కట్ ఫామ్. ఈ సినిమా టైటిల్ అదే పెట్టారు. దీనిపై ‘ఎల్ఐసి’ సంస్థ సతీష్ విగ్నేష్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ సంస్థ కి దశాబ్దాల నుండి ఇండియా లో ఎంతో గొప్ప పేరు ఉందని, తమ సంస్థ పేరు ని ఒక సినిమాకి టైటిల్ గా ఉపయోగిస్తే మా సంస్థ పరువుకు భంగం కలిగే ప్రమాదం ఉందని, వారం రోజుల్లోపు టైటిల్ ని మార్చకపోతే లీగల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టి డైరెక్టర్ మరియు నిర్మాతని అరెస్ట్ చెయ్యిస్తాము అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

దీనిపై సతీష్ విగ్నేష్ నుండి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ సినిమా టైటిల్ పై కోలీవుడ్ సంగీత దర్శకుడు కుమారన్ కూడా అభ్యతరం వ్యక్తం చేసాడు. ఈ టైటిల్ ని నేను 8 ఏళ్ళ క్రితమే రిజిస్టర్ చేయించుకున్నాని, నా అనుమతి లేకుండా ఈ టైటిల్ ని వాడేశారు అంటూ రచ్చ చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here