Polimera : గతేడాది భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో పొలిమేర 2ఒకటి. అందులో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ జంటగా నటించారు. ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 3న విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. కరోనా సమయంలో పొలిమేర సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా ఓటీటీకే పరిమితం అయింది. చేతబడి నేపథ్యంలో పొలిమేర ఉంటే.. దానికి ఆలయ రహస్యాన్ని జోడించి పొలిమేర 2 తెరకెక్కించారు. చిన్న సినిమాగా మొదలై.. భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పొలిమేరలో కథానాయిక కామాక్షికి అంత ప్రాధాన్యం లేకపోయినా రెండో భాగంలో మాత్రం ఆమెదే ప్రధాన పాత్ర. అన్యాయం చేసిన భర్తను చంపేందుకు కూడా వెనుకాడని లచ్చిమి పాత్రలో కామాక్షి భాస్కర్ అత్యద్భతంగా నటించింది. ఈ సినిమా తర్వాత కామాక్షికి మంచి గుర్తింపు రావడంతో పాటు వరుస అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కామాక్షి భాస్కర్ తాజాగా తన హాట్ లుక్తో అభిమానులను షేక్ చేసింది. ట్రెడిషనల్ లుక్లో కనిపించిన ఈ చిన్నారి ఒక్కసారిగా అందాలను ఆరబోసింది. తాజాగా ఈ భామ డిజైనర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది. ఆరెంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ చూపించి మైమరిపించింది ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్గా మారాయి. పొలిమేర లచ్చిమి.. ఇంత హాట్ అయితే ఎలాగే పిల్ల..‘పొలిమేర’ హద్దులన్నీ చెరిపేశావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ అమ్మడు ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.