Rajinikanth : సీనియర్ స్టార్ బ్యూటీ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. కోట్లాది మంది కుర్రాళ్ల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ, ఈ రంభ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రంభనే ఆ రంభ అని తెలుగు కుర్రాళ్లు ఫిక్స్ అయ్యారు. అప్పట్లో ఆమెకు ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా హీరోయిన్ గా తన స్టామినా ప్రూవ్ చేసుకున్న స్టార్ బ్యూటీ రంభ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయత్నంలో ఉంది.
రంభ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజనీకాంత్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. నేను రజనీకాంత్ సర్‌తో అరుణాచలంలో షూటింగ్ చేస్తున్న సమయంలో హిందీలో సల్మాన్ ఖాన్ బంధన్ సినిమా కూడా చేయాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఏకకాలంలో జరగడంతో మధ్యాహ్నం వరకు అరుణాచలంలోనూ, మధ్యాహ్నం నుంచి బంధన్ సెట్స్‌లోనూ షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది.
అయితే రెండు సినిమాల షూటింగ్ సెట్స్ పక్కపక్కనే ఉండడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదని చెప్పింది. కానీ ఒకసారి జరిగిన సంఘటన.. ఇప్పటికీ నాకు గుర్తుందని వివరించింది. అరుణాచలం సినిమా సెట్స్‌పైకి హీరో సల్మాన్ వచ్చారు. అది చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను. ఆ తర్వాత రజినీ సార్ వచ్చి టవల్ విసిరి కొట్టి నాతో కోపంగా మాట్లాడారు. కెమెరామెన్ వచ్చి నువ్వు ఇలా చేసి ఉండకూడదు అని అన్నాడు.
మీతో కలిసి పని చేయనని రజనీ సార్ చెప్పారని వివరణ ఇచ్చారు. దాంతో నేను ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు రజినీ సార్ వచ్చి ఈ అమ్మాయిని ఎవరు ఏడిపించారు అని అడిగాడు. అసలు ఏం జరిగింది, నేనేం తప్పు చేశానని రజనీ సర్ని అడిగాను. ఉదయం సల్మాన్ ను కౌగిలించుకున్నావ్ కదా.. మాకైతే షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి వెళ్లిపోతావ్ అంటూ ఆటపట్టించారు. అయితే ఇదంతా సెట్లో వాళ్లందరికీ ముందే తెలుసని, వాళ్లకు కూడా కావాలనే తనను ఆట పట్టించారని చెప్పుకొచ్చింది. రంభ షేర్ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.