Salaar : గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద మన టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిల్చిన చిత్రం ‘సలార్’. వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్ కి ఈ చిత్రం బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కేజీఎఫ్ వంటి సంచలనాత్మక సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా సునామి లాంటి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి దాదాపుగా 580 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ వారం కూడా ఏ సినిమా విడుదల లేకపోవడం తో సంక్రాంతి వరకు థియేట్రికల్ షేర్స్ వస్తాయి. కానీ ఈ సినిమాకి ఓపెనింగ్స్ లో ఉన్నంత ఊపు, లాంగ్ రన్ లో లేదనే చెప్పాలి. కేవలం పండుగ సెలవల్లో మాత్రమే ఈ చిత్రానికి థియేట్రికల్ షేర్స్ వస్తున్నాయి. మిగిలిన సమయం లో అనుకున్న రేంజ్ పెర్ఫార్మన్స్ లేదు.

ఉదాహరణకి గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి, సునామి లాంటి వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం సంక్రాంతి సెలవుల్లో మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రం దంచికొట్టేసింది. ఈ సినిమాకి రెండవ వారం దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కానీ ‘సలార్’ చిత్రానికి మాత్రం రెండవ వారం లో కేవలం 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా సెకండ్ వీకెండ్ లో ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. కానీ ఈ సినిమాకి న్యూ ఇయర్ రోజు బాగా కలిసి వచ్చింది. ఆరోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. న్యూ ఇయర్ లేకపోతే ఈ ఇంకా తక్కువ వసూళ్లు వచ్చేవని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.
