Pawan Kalyan : సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత, సినిమాల పరంగా అదే రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న రోజుల్లోనే ఆయన తన కెరీర్ ని రిస్క్ లో పెట్టి జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు.

మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా, ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పార్టీ ని నిలబెట్టి అతి త్వరలోనే ప్రభుత్వాన్ని స్థాపించడం లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మందికి తన కష్టార్జీతం ని దానం ఇచ్చాడు. అతని సేవలను గుర్తిస్తూ చెన్నై లోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కి ‘డాక్టరేట్’ ని ఇస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేసింది.

దీనిని పవన్ కళ్యాణ్ చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘వేల్స్ యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ ని ఇచ్చినందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. కానీ ఈ సమాజం లో నాకంటే ఎంతో సాధించినవారు, సమాజానికి సేవ చేసినవాళ్లు ఉన్నారు. వాళ్లకు ఇంకా డాక్టరేట్ పురస్కారం రాలేదు. నాకు ఇచ్చే బదులు వాళ్లకు ఈ పురస్కారం ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల ఈ ఈవెంట్ కి రాలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. డాక్టరేట్ పురస్కారం ని ప్రతీ స్టార్ సెలబ్రిటీ ఒక అదృష్టం లాగ భావిస్తారు, అలాంటిది పవన్ కళ్యాణ్ నేను దానికి అర్హుడిని కాదు అంటూ రిజెక్ట్ చెయ్యడం ఆయన ఉన్నత భావాలకు నిదర్శనం అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
