Jhanvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి పాపం కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. చేసిన సినిమాలన్నీ ఢమాల్ అయ్యాయి. కానీ ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మాత్రం మామూలుది కాదు. అంతే కాదు డైరెక్టర్స్ కూడా ఈమె డేట్స్ కోసం ఎగబడుతుంటారు.
ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కూతురు అయినప్పటికీ కూడా సక్సెస్ రేట్ లేకపోతే అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ ని మనం ఇది వరకు ఎంతో మందిని చూసాము. కానీ ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా ఈ రేంజ్ ని మాత్రం కేవలం జాన్వీ కపూర్ మాత్రమే చూస్తుంది. ప్రస్తుతం ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా మీద ఆమె భారీ ఆశలు పెట్టుకుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో, తన చిన్నతనం లో అమ్మతో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మ నన్ను ఎప్పుడూ కూడా ఒక అబ్బాయి లాగానే చూసేది. ఒకరోజు నాకు అమ్మ లిప్ స్టిక్ వాడాలని అనిపించింది. అంతే వెంటనే ఆమె రూమ్ లోకి వెళ్లి ఆమె డెస్క్ లో ఉన్న వివిధ రకాల లిప్ స్టిక్ కలర్స్ ని నా పాకెట్స్ మొత్తం నింపేసాను. ఇది గమనించిన అమ్మ, లిప్ స్టిక్స్ ఏవి, ఒకసారి చూపించు అనింది. పాకెట్ లో ఉన్న లిప్ స్టిక్స్ కోసం, దొంగ నా కొడకా అని తిట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన ‘దేవర’ చిత్రం ఏప్రిల్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.