Mahesh Babu : బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు రికార్డ్స్ విషయం నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతూ ఉంటాయి. కానీ హీరోల మధ్య మాత్రం వ్యక్తిగతంగా అలాంటి పోటీ వాతావరణం ఏమి ఉండదు. అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ స్టార్ హీరోలు అయితే అన్నదమ్ములు లాగ ఉంటారు. అభిమానుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మేమంతా ఎప్పటికీ ఒక్కటే అని సందర్భంగా వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటారు.
అలా ఇండస్ట్రీ లో అందరితో స్నేహ భావం తో మెలిగే హీరోల లిస్ట్ తీస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కచ్చితంగా ఉంటుంది. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జున వంటి వారితో పాటుగా, తన తోటి స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలతో కూడా ఎంతో స్నేహంగా ఉంటాడు.
కానీ ఒక హీరో అంటే మహేష్ బాబు కి ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా కాలం నుండి ఒక టాక్ వినిపిస్తుంది. ఆ హీరో మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట. ‘అలా వైకుంఠపురంలో’ మరియు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలు సంక్రాంతికి పోటీ పడినప్పుడు వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందని టాక్. ఆ తర్వాత పుష్ప సినిమా విషయం లో ఆ గొడవ తార స్థాయికి చేరుకుందని తెలుస్తుంది. ముందుగా పుష్ప సినిమా స్టోరీ ని మహేష్ బాబు కి వినిపించాడు డైరెక్టర్ సుకుమార్.
కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొని రమ్మని సుకుమార్ కి చెప్పాడు. కానీ ఈలోపే పుష్ప సినిమా సబ్జెక్టు విని , తనకి లాక్ చేసేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం లో మహేష్ చాలా హర్ట్ అయ్యాడట. అప్పట్లో సుకుమార్ కి ఒక ట్వీట్ కూడా వేసాడు, అది వైరల్ అయ్యింది. అలా అందరూ హీరోలతో మంచిగా ఉండే మహేష్ కి అల్లు అర్జున్ తో గత మూడేళ్ళ నుండి సరిగా పడట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.