Dhootha : మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తర్వాత టాలీవుడ్ లో మార్కెట్ సంపూర్ణంగా సూన్యం అయిపోయే పరిస్థితి వచ్చిన ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది అక్కినేని ఫ్యామిలీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగార్జున కి వరుసగా సింగిల్ డిజిట్ క్లోసింగ్ షేర్స్ ఇటీవల కాలం లోనే వచ్చాయి. రెండవ కొడుకు అక్కినేని అఖిల్ అయితే ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా లేదు.
మరోపక్క పెద్ద కొడుకు నాగ చైతన్య వరుసగా హిట్స్ కొడుతున్నాడు, అక్కినేని పరువు నిలబెడుతున్నాడు అని అనుకుంటే, ఆయనకీ కూడా ఈమధ్య వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. అలాంటి సమయం లో నాగ చైతన్య తో పాటుగా, అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని నిలబెట్టింది ‘దూత’ అనే వెబ్ సిరీస్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ గత ఏడాది డిసెంబర్ 1 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు సస్పెన్స్ తో కొనసాగిన ఈ వెబ్ సిరీస్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పొరపాటున ఈ కథ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. ఒకవేళ సినిమాగా తీసి ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పేది. అక్కినేని కుటుంబానికి కావాల్సిన భారీ కమర్షియల్ బాక్స్ ఆఫీస్ హిట్ దక్కేది అని పలువురి అభిప్రాయం.
అయితే ఈ వెబ్ సిరీస్ ని తొలుత నాగ చైతన్య తో తియ్యాలని అనుకోలేదట. మెగా ఫ్యామిలీ లో ఇలాంటి కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వరుణ్ తేజ్ తో ఈ స్టోరీ ని చేద్దాం అనుకున్నారట. కానీ వరుణ్ తేజ్ కి మాత్రం అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడలేదు, అందుకే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదట. నాగ చైతన్య కూడా మొదట్లో వెబ్ సిరీస్ చెయ్యడానికి ఒప్పుకోలేదు. కానీ అప్పట్లో సమంతానే నాగ చైతన్య ని ఒప్పించి ఈ వెబ్ సిరీస్ చేయించింది అట.