Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి ఓపెనింగ్స్ ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ ని అయితే రాబట్టగలిగింది కానీ, ఫుల్ రన్ లో ఆశించిన స్థాయి వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ మరియు రేటింగ్స్ కి కచ్చితంగా 1000 కోట్ల రూపాయిల వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాదు, అన్నీ రాష్ట్రాల్లో ఆయనకీ మంచి మార్కెట్ ఉంది. అలాంటి మార్కెట్ ఉన్న హీరో కి టాక్ పడితే ఆ మాత్రం అంచనాలు ఉండడం సహజం. కానీ ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం 580 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకున్న లియో చిత్రానికి, ఫుల్ రన్ లో దాదాపుగా 640 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. సలార్ ప్రస్తుత ట్రెండ్ చూస్తూ ఉంటే లియో చిత్రానికి దరిదాపుల్లో కూడా వెళ్లే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది. నిన్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి ప్రతీ రోజు రెవిన్యూ వస్తున్నది ఓవర్సీస్ ప్రాంతం నుండే. అక్కడ ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా రోజుకి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. కానీ ఎంత వచ్చినా సంక్రాంతి వరకే, ఆ తర్వాత ఛాన్స్ ఉండదు, సలార్ చిత్రం లియో ని అప్పటి లోపు క్రాస్ చెయ్యడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.