Rajinikanth : ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో మన అందరికి ముందుగా మైండ్ లోకి గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఒక బస్సు కండక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రజినీకాంత్, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సంపాదించి చిన్న చిన్న రోల్స్ ద్వారా కెరీర్ ని నెట్టుకొస్తూ, ఆ తర్వాత హీరో గా మారి, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడు.
హీరో గా ఎదుగుతున్న రోజుల్లో అప్పట్లో ఈయన దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించాడు. తమిళం లోనే కాకుండా, తెలుగు లో ఎన్టీఆర్, కృష్ణ మరియు చిరంజీవి వంటి వారితో చాలా సినిమాలు చేసాడు. అలాగే హిందీ లో అమితాబ్ బచ్చన్ తో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఇదంతా పక్కన పెడితే మన తెలుగు హీరోల్లో మోహన్ బాబు రజినీకాంత్ కి చాలా మంచి స్నేహితుడు.
వీళ్లిద్దరు కలిసి పెదరాయుడు అనే సినిమా చేసారు. ఆ చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించలేదు కానీ, రజినీకాంత్ రాసిన కథతో మోహన్ బాబు అప్పట్లో ‘రాయలసీమ రామన్న చౌదరి’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ ని దక్కించుకుంది. రజినీకాంత్ తో బాషా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
అయితే ఆయనకీ ఆ సమయం అనారోగ్యం కారణంగా ఒక 15 రోజులు షూటింగ్ కి రాలేదట. ఆ సమయం లో రజినీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు అని, ఆ తర్వాత కూడా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేసి , డైరెక్టర్ సురేష్ కృష్ణ తిరిగి సెట్స్ లోకి వచ్చినప్పుడు కొన్ని సూచనలు చేసాడని అప్పట్లో ఒక్క టాక్ ఉండేది. అలా రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇదే అని అంటుంటారు.