Leo : చేసింది అతి తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ, రాజమౌళి మరియు శంకర్ లాంటి డైరెక్టర్స్ మేకింగ్ కి సవాలు విసిరిన దర్శకులలో ఒకరు లోకేష్ కనకరాజ్. సందీప్ కిషన్ లాంటి చిన్న హీరో తో ‘నగరం’ అనే చిత్రం ద్వారా లోకేష్ కనకరాజ్ సినీ కెరీర్ మొదలైంది. ఆ చిత్రం తర్వాత ఆయన ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ మరియు రీసెంట్ గా ‘లియో’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
అన్నీ కూడా ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ‘లియో’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 630 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫ్లాప్ అవుతుంది అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే లోకేష్ కనకరాజ్ రేంజ్ ప్రసుతం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే లోకేష్ తన మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన లియో వరకు ప్రతీ చిత్రంలో ‘డ్రగ్స్’ అంశాన్ని తీసుకొనే సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజు మురుగన్ అని మదురై కి చెందిన వ్యక్తి హై కోర్ట్ లో లోకేష్ కి సైకోలాజికల్ పరీక్షలు చేయాల్సిందిగా పిటీషన్ ని దాఖా చేసాడు. ఆ పిటిషన్ లో ఏముందంటే రీసెంట్ గా లోకేష్ దర్శకత్వం వహించిన ‘లియో’ చిత్రం లో మితిమీరిన హింస ఉంది.
డ్రగ్స్ వాడకం, మహిళలు మరియు పిల్లల పట్ల హింస, రకరకాల ఆయుధాలు వాడడం, మతానికి సంబంధించిన చిహ్నాలు వాడడం వంటి వాటిని ఈ సినిమా ప్రమోట్ చేసింది. ఇలాంటి ఆలోచనలను ప్రమోట్ చేస్తున్నాడంటే కచ్చితంగా ఇతను మానసిక పరిస్థితి ని పరిశీలించాల్సిందే అంటూ కోర్టు ని ఈ సందర్భంగా ఆయన కోరాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.