Jagat Desai : కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనా సినిమాతో కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా మూడేళ్లు నిండకుండానే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విజయ్ తర్వాత అమల కూడా మరొకరితో ప్రేమలో పడింది. పెళ్లాడింది అనుకొనేలోపే అతడిపై చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది. ఆ తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ఇక గతేడాది ఈ చిన్నది జగత్ దేశాయ్ ను వివాహమాడింది.

జూన్ నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు. ప్రస్తుతం అమలాపాల్ అభిమానులకు శుభవార్త చెప్పింది. మేం ముగ్గురం కాబోతున్నాం అని పోస్ట్ చేసింది. అమల తల్లి కాబోతోందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి.. పెళ్లయి రెండు నెలలే అయింది. అప్పుడే మూడో నెల అసలు సంగతేంటి ? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇప్పుడు సెలబ్రిటీలంతా గర్భం దాల్చి పెళ్లి చేసుకుంటున్నారంటే.. మరికొందరు ఇదే మ్యాజిక్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పలువురు అమలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమల కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఆడు జీవనం, ద్విజ సినిమాలతో పాటు లెవల్ క్రాస్ సినిమాలో నటిస్తోంది.
