Actress : సైబర్ కేటుగాళ్ల వలలో పడిన స్టార్ బ్యూటీ.. ఎన్ని లక్షలు సమర్పించుకుందో తెలుసా ?

- Advertisement -


Actress : వెండితెరపై తన నటనతో ఎంతో పేరుతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే అదంతా రీల్ లైఫ్. కానీ ప్రస్తుతం ఆమె రియల్ లైఫ్‌లో సైబర్ కేటుగాళ్ల అద్భుత నటనకు బుక్ అయిపోయింది. లక్షల రూపాయల నష్టపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తెలివైన న‌టిగా పేరున్న ఆమె సైబర్ దొంగల చేతికి ఎలా చిక్కింది. ఎలా మోసపోయింది.. అలాంటి ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి.. ఇలాంటి కాల్స్ వస్తే ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకోవడానికి ఇదో అనుభవం. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ సినిమాల్లో మంచి పాపులారిటీ సంపాదించి.. స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అంజలీ పటేల్.

ఆ పేరంటే గుర్తుకు రాకపోవచ్చు కానీ నా బంగారు తల్లి సినిమాలో లీడ్ క్యారెక్టర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఆ సినిమాకు గానూ ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ సినిమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. సైబర్ మోసాల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది. డిసెంబరు 25న దీపక్ శర్మ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను ఫెడెక్స్ ఉద్యోగి అని చెప్పుకుంటూ తన పేరు మీద డ్రగ్స్ ఉన్న పార్శిల్ వచ్చిందని, తైవాన్‌లో పట్టుబడ్డానని చెప్పాడు. పార్శిల్ లో ఆధార్ కార్డు కాపీ ఉందని తెలిపారు.

డ్రగ్స్ క్రైమ్ తనపై పడుతుందేమోనని భయపడిన అంజలి.. తన ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందనే భయంతో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించానని వివరించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే సైబర్ నేరగాళ్లు సైబర్ బ్రాంచ్ నుంచి ఆమెకు ఫోన్ చేసి ఆధార్ కార్డు తన బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైందని, మనీలాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉండవచ్చని హెచ్చరించారు. దీంతో కంగారు పడిన ఆమె భయాందోళనకు గురైంది. తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.96,525 తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. కొంతసేపటి తర్వాత మళ్లీ ఈ కేసులో విచారణ నిమిత్తం రూ.4.83 లక్షలు పంపాలని మళ్లీ ఫోన్ చేశారు.

- Advertisement -

అయితే ఏమాత్రం ఆలోచించకుండా ఆధార్ దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశ్యంతో అతడు అడిగిన మొత్తం ఇచ్చింది. కొద్దిసేపటికి అంజలి మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు సమాచారం అందించింది. కానీ ఈ ప్రక్రియలో మొత్తం రూ.5.79 లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే స్టార్ సెలబ్రెటీలు కూడా ఇలాంటి ట్రిక్స్‌ని ఈజీగా నమ్మి మోసపోవడంపై అందరూ షాక్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com