Actress Tapsi Pannu : టాలీవుడ్ లో అందం మరియు యాక్టింగ్ టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో తాప్సి ఒకరు. ఈమె దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మంచు మనోజ్ ని హీరోగా పెట్టి తీసిన ‘ఝుమంది నాదం’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న తాప్సి కి టాలీవుడ్ లో అవకాశాలు అయితే బాగానే వచ్చాయి కానీ, సక్సెస్ శాతం చాలా తక్కువే.
కానీ ఏ ముహూర్తం లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో కానీ, అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గానే ఆమె షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన ‘డుంకీ’ చిత్రం విడుదలై మంచి సక్సెస్ ని సాధించింది. తాప్సి నటనకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
గతం లో కూడా ఇలాగే మన లెజండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు మీద అనుచిత కామెంట్స్ చేసి ఆ తర్వాత ఆయనకీ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీదనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సౌత్ మరియు నార్త్ గా విభజించి చూస్తున్నారు. అసలు సౌత్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది..?, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలు ఇండస్ట్రీస్ గా విడిపోయి రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తాప్సి కి ఇంత నోటి దూల ఎందుకు?, ఎదో బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుంది, ఆమె ఇష్టం , అలాగే చేసుకోవచ్చు కదా, ఎందుకు సౌత్ ఇండియన్ సినిమా గురించి తక్కువగా మాట్లాడడం అంటూ నెటిజెన్స్ తాప్సి ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.