Tamanna : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ప్రేక్షకులను తన అందచందాలతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2లో తమ్ము బేబీ ఇంటిమేట్ సీన్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. తాజాగా తమన్నా తెలుగు తప్పా మిగతా భాషల్లో నటిస్తోంది. తాజాగా తమన్నా నటించిన దట్ ఇజ్ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెరకెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
2016లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఎందుకో కానీ ఈ సినిమాను రిలీజ్ చేయలేదు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. కాపీ రైట్స్ విషయంలో వచ్చిన వివాదాల కారణంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇక షూటింగ్ అయిన తరువాత రిలీజ్‌కు ఇంత గ్యాప్ రావడంతో దర్శకుడు, హీరోయిన్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి దాదాపు మర్చిపోయారు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అక్కడే డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే దట్ ఇజ్ మహాలక్ష్మి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పై క్లియరెన్స్ కూడా రానుంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీరోల్ ప్లే చేశాడు.