Shruti Haasan : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మెయిన్ పిల్లర్స్ లో ఒకరు కమల్ హాసన్. చిన్నతనం నుండే అందరం ఈయన సినిమాలను చూస్తూ పెరిగాం. కేవలం మనం మాత్రమే కాదు, స్టార్ సెలబ్రిటీస్ కి కూడా నటన లో నిఘంటువు కమల్ హాసన్. అలాంటి దిగ్గజ నటుడి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, మొదటి సినిమా నుండే తన మార్కుని క్రియేట్ చేసుకోవడం కోసం ఎంతో కష్టపడింది శృతి హాసన్. పాపం అప్పట్లో ఈమె ఎంత కష్టపడినా సినిమాలు ఆడేవి కాదు.
వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ పడడం తో కమల్ హాసన్ కూతురు అయ్యినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు ఇవ్వడానికి భయపడేవారు దర్శక నిర్మాతలు. అలాంటి సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెకి ‘గబ్బర్ సింగ్’ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో చరిత్ర తిరగరాసింది, పవర్ స్టార్ సత్తా ఏమిటో ప్రపంచానికి అర్థం అయ్యేలా చేసింది.
అంతే కాకుండా అప్పటి వరకు ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న శృతి హాసన్ గోల్డెన్ లెగ్ అని పిలిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఎక్కువ శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి శృతి హాసన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నాకు జీవితాన్ని ఇచ్చింది మా నాన్న కమల్ హాసన్ అయితే, సినీ జీవితాన్ని ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణే..గబ్బర్ సింగ్ చిత్రం లో ఆయన నాకు అవకాశం ఇవ్వకపోయ్యుంటే, నేడు నేను ఈ రేంజ్ లో ఉండేదాన్ని కాదు’ అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ ఏడాది నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక హీరోయిన్ శృతి హాసన్ మాత్రమే. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసాయి. రీసెంట్ గా సలార్ చిత్రం కూడా.