Bigg Boss Amar : ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో పెద్ద హిట్ అయితే అయ్యింది కానీ చాలా వరకు అన్యాయం గానే జరిగింది అని చెప్పాలి. కామన్ మెన్ మరియు రైతు బిడ్డ అనే ట్యాగ్ ని పట్టుకొని ఒకరు కాదు , ఏకంగా ముగ్గురు టాప్ 5 వరకు వచ్చారు. బిగ్ బాస్ ఆడవాళ్లు, మగవాళ్ళు సమానం అని అన్నప్పుడు, ఎందుకు కామన్ మెన్ మరియు సెలెబ్రిటీలు ఒక్కటే అని ఎందుకు చెప్పరు..?.
శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ ఈ కామన్ మెన్ ట్యాగ్ ఉపయోగించుకొని సానుభూతి పొందాలని చూస్తున్నప్పుడు ఎందుకు నాగార్జున వీళ్ళను ఆపలేదు? అనే సందేహాలు జనాల్లో ఎప్పటి నుండో మెలుగుతూనే ఉంది. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరి మధ్య వాగ్వివాదాలు జరిగాయి, కానీ కేవలం పల్లవి ప్రశాంత్ మీద ఎవరైనా అరిచినప్పుడు మాత్రం కామన్ మెన్ ని టార్గెట్ చేసారు, రైతు బిడ్డని టార్గెట్ చేసారు అని శివాజీ రుద్దడం ప్రారంభించాడు.
దీని పరిణామాలు బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు. వీటి అంతటికి కారణం ముమ్మాటికీ శివాజీనే. షో అయిపోయింది, బయటకి వచ్చేసారు, ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి. కానీ శివాజీ అమర్ మీద ఉన్న అక్కసు ని మాత్రం ఇప్పటికీ వదలలేకపోతున్నాడు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘బిగ్ బాస్ కొన్ని విషయాల్లో అన్యాయం చేసాడు. అమర్ దీప్ ని అనవసరంగా లేపాడు అని అనిపించింది.వాడు రోటీలు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా పొగిడాడు, నేను అంతమంది కోసం వడలు చేసినప్పుడు మాత్రం చిన్న ప్రశంస కూడా ఇవ్వలేదు. ఇలా చాలా విషయాల్లో జరిగింది. అందుకే వాడు రన్నర్ అయ్యాడు. న్యాయంగా చూసుకుంటే నేను , ప్రశాంత్ మరియు యావర్ టాప్ 3 లో ఉండాలి. కానీ తప్పుడు ఆటలు ఆడిన అమర్ దీప్ రన్నర్ అయ్యాడు..ఇది నాగార్జున గారికే అవమానకరం’ అంటూ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.