Venky Movie Re Release Collections : గత ఏడాది రీ రిలీజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించాయో మన అందరం చూసాము. కొత్త సినిమాలు కొన్ని అట్టర్ ఫ్లాప్స్ అయ్యి థియేటర్స్ ఖాళీగా ఉన్న సమయం లో ఈ రిలీజ్ సినిమాలు థియేటర్స్ కి మంచి ఫీడింగ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఏ ట్రెండ్ అయిన ఒక స్టేజి దాటిన తర్వాత జనాలకు బోర్ కొట్టేస్తుంది.
అలా ఈ రీ రిలీజ్ ట్రెండ్ హవా ఈమధ్య కాలం లో కాస్త తగ్గింది అనే చెప్పాలి. ఇక రీ రిలీజ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని బయ్యర్స్ అనుకున్నారు. అలాంటి సమయం లో విడుదలైన రవితేజ సూపర్ హిట్ చిత్రం ‘వెంకీ ‘ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా విడుదలైన రవితేజ కొత్త సినెమాలన్నిటికంటే ఈ చిత్రానికి బుకింగ్స్ అదిరిపోయాయి.
ట్రేడ్ పండితులు సైతం ఈ రీ రిలీజ్ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వెంకీ తో సమానమైన క్రేజ్ ఉండే ‘అదుర్స్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసినప్పుడు కనీసం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు, అలాంటిది ‘వెంకీ’ చిత్రానికి ఏకంగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. అందులోనూ ఈ చిత్రం రీ రిలీజ్ సమయం లో ప్రభాస్ ‘సలార్’ మూవీ మేనియా నడుస్తుంది.
అలాంటి సమయం లో వచ్చి ఒక రీ రిలీజ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీమెర్స్ ఎక్కువగా వెంకీ సినిమాకి సంబంధించిన సన్నివేశాలని ఉపయోగిస్తూ ఉండేవారు. అలా యూత్ లో ‘వెంకీ’ మీమ్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దానివల్లనే ఈ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.