Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. టీఆర్ఫీ రేటింగ్స్ దగ్గర నుండి, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ వరకు ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి . ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా, రన్నర్ గా అమర్ దీప్ నిలిచాడు. ఇక సినీ నటుడు, ఈ షో ద్వారా చాణక్య అని అనిపించుకున్న శివాజీ మాత్రం టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు.

కానీ అతను లేకపోతే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అంత డ్రామా నడిచేది కాదని, పల్లవి ప్రశాంత్ మరియు యావర్ వంటి వారు కనీసం టాప్ 5 లో కూడా నిలబడేవారు కాదని ఆడియన్స్ అభిప్రాయం. హీరో గా శివాజీ ఎంత మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడో తెలియదు కానీ , బిగ్ బాస్ షో ద్వారా మాత్రం కోట్లాది మంది మంది ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాడు అనే చెప్పాలి.

ఇకపోతే ఈ సీజన్ ని కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ కూడా బలంగా ఫాలో అయ్యారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకడు అట. చిరంజీవి కి మరియు ఆయన సతీమణి సురేఖ కి శివాజీ ఆట ఎంతో నచ్చిందట. మొన్న ఈటీవీ వెంకటేష్ 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ వారు ఒక ఫంక్షన్ ని ఏర్పాటు చేసారు.

ఈ ఫంక్షన్ కి శివాజీ తో పాటుగా చిరంజీవి, నాని మొదలగు సెలబ్రిటీస్ కూడా విచ్చేసారు. ఈ ఫంక్షన్ లో శివాజీ ని కలిసిన చిరంజీవి ‘బిగ్ బాస్ చూసాం అయ్యా..నేను మా ఆవిడ కేవలం నీకోసమే బిగ్ బాస్ చూసేవాళ్ళం. అద్భుతంగా ఆడావు’ అని పొగిడాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శివాజీ ఈ విషయం చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
