Rashi : హీరోయిన్ రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో కొన్నేళ్ల క్రితం కుర్రాళ్ల కలల రాణిగా ఓ వెలుగు వెలిగింది. తన భారీ అందాల కోసమే మగాళ్లు సినిమాలు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అటు వెండితెరపై, ఇటు బుల్లితెర పై నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తోంది. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పుడు ఉన్నంత క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం రాశికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

అది గనుక నిజమే అయితే రాశికి జాక్ పాట్ ఆఫర్ అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో రాశి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ పాత్ర పడితే ఆ పాత్రను ఒప్పుకోవడం లేదు. తన కెరీర్ కు ఎలాంటి హైప్ వస్తుందన్న లెక్కేలసి మరీ చూస్ చేసుకుంటుంది. కంటెంట్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

నిజానికి హీరోయిన్ రాశి బాలయ్య సినిమాలో బాలనటిగా చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయనతో కృష్ణ బాబు అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆడిపాడింది. ఆ సినిమాలో వారి స్క్రీన్ ప్రజెంట్స్ బాగనిపించింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆయనకు ప్రత్యర్థి పాత్రలో కనిపించబోతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఈ విలనిజం ఆమెకు ఎలా కలిసి వస్తుందో చూడాలి మరి.